ఒమర్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పు బాబు

కశ్మీర్ కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచార [more]

;

Update: 2019-04-01 13:29 GMT
nanrendra modi cabinet ministers
  • whatsapp icon

కశ్మీర్ కు ప్రత్యేక ప్రధానమంత్రి కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… కశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ మహాకూటమిలో భాగంగా ఉందన్నారు. రెండురోజుల క్రితం ఆ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లాతో యూటర్న్ బాబు ప్రచారం చేయించుకున్నారని పేర్కొన్నారు. ఓమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ఉన్న చంద్రబాబుకు ఓట్లు వేసేముందు ఆలోచించాలన్నారు. ఓమర్ వ్యాఖ్యలపై మహాకూటమి నేతలంతా సమాధానం చెప్పాలన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారని, సైనికుల త్యాగాన్ని అనుమానించారని పేర్కొన్నారు. హిందుస్థాన్ హీరో ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్ ఎవరో ప్రజలే తేల్చాలన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లీస్ పార్టీ చేతిలో ఉందన్నారు. కారుకు మజ్లీస్ పార్టీ పంక్చర్ చేయడం ఖాయమన్నారు. ఏప్రిల్ 11న టీఆర్ఎస్ కు ప్రజలు షాకివ్వాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News