ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు
ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసునని, ఏపీ పాలకులు ఏదైనా చేసి ఉంటే దాని గురించి మాట్లాడి ఉండేవారని, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.వాస్తవాలు ప్రజలకు తెలుసునన్నారు. [more]
ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసునని, ఏపీ పాలకులు ఏదైనా చేసి ఉంటే దాని గురించి మాట్లాడి ఉండేవారని, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.వాస్తవాలు ప్రజలకు తెలుసునన్నారు. [more]
ఏపీలో ఏం జరుగుతుందో నాకు తెలుసునని, ఏపీ పాలకులు ఏదైనా చేసి ఉంటే దాని గురించి మాట్లాడి ఉండేవారని, ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.వాస్తవాలు ప్రజలకు తెలుసునన్నారు. ఆయన ఏపీ బీజీపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్రంపై ఏపీ ప్రభుత్వం అసత్య ప్రచారాం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇచ్చామని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని మోదీ ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది తమ ప్రభుత్వమేనని, ఇప్పటి వరకూ ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కాగ్ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపై రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఏపీకి జాతీయ సంస్థలు ఇంత పెద్ద ఎత్తున రావడం ఎప్పుడైనా చూశారా? అని అన్నారు. ఏపీ విభజన హామీల అమలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆ నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోరని మోదీ తెలిపారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. అసత్య ప్రచారాన్ని యువత నమ్మొద్దన్నారు.