పాక్ చెరలో ప్రశాంత్

పాకిస్తాన్ చెరలో వున్న తమ కొడుకును వెంటనే విడిపించాలని ప్రశాంత్ తండ్రి బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ కొడుకు నెల రొజుల నుంచి టచ్ లో [more]

Update: 2019-11-19 06:00 GMT

పాకిస్తాన్ చెరలో వున్న తమ కొడుకును వెంటనే విడిపించాలని ప్రశాంత్ తండ్రి బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ కొడుకు నెల రొజుల నుంచి టచ్ లో లేకుండా పొయాడని తెలిపాడు. పాకిస్థాన్‌లో హైదరాబాద్‌ వాసి ప్రశాంత్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్‌ ఎడారిలో ప్రవేశించేందుకు యత్నించారని ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ప్రశాంత్‌ను బహవల్పూర్ దగ్గర పాక్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ప్రశాంత్‌ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రశాంత్‌ను విడిపించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కూకట్ పల్లిలో వున్న ప్రశాంత్ తండ్రి బాబురావు కోరుతున్నారు.

Tags:    

Similar News