నేను క్షేమంగానే ఉన్నా..!

పాకిస్తాన్ ఆర్మీ తనను బాగా చూసుకుంటుందని పాక్ చేతికి చిక్కిన పైలట్ అభినందన్ తెలిపారు. అభినందన్ మాట్లాడిన ఒక వీడియోను పాక్ విడుదల చేసింది. ఈ వీడియో [more]

Update: 2019-02-27 13:05 GMT

పాకిస్తాన్ ఆర్మీ తనను బాగా చూసుకుంటుందని పాక్ చేతికి చిక్కిన పైలట్ అభినందన్ తెలిపారు. అభినందన్ మాట్లాడిన ఒక వీడియోను పాక్ విడుదల చేసింది. ఈ వీడియో అభినందన్ మాట్లాడుతూ… పాకిస్తాన్ లో తాను ప్రమాదవశాత్తూ దిగగానే తనపై ఒక గుంపు దాడి చేస్తుంటే పాక్ ఆర్మీ బలగాలు ఆపారని ఆయన తెలిపారు. పాకిస్తాన్ జవాన్లు బాగా చూసుకుంటున్నారని, వారి పట్ల తాను ఇంప్రెస్ అయ్యానని చెప్పారు. తాను క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, తన ఎయిర్ క్రాఫ్ట్ వివరాలను, లక్ష్యాన్ని పాక్ ఆర్మీ అధికారులు అడగగా చెప్పేందుకు అభినందన్ నిరాకరించారు.

Tags:    

Similar News