శబరిమలలో మరో ఎనిమిది మంది మహిళలు..?

మూడో రోజుల క్రితం బిందు అమ్మిని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లి అయప్ప స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత [more]

;

Update: 2019-01-05 09:00 GMT
another momen entered sabarimala
  • whatsapp icon

మూడో రోజుల క్రితం బిందు అమ్మిని, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లి అయప్ప స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత కేరళ అట్టుడుకుతోంది. అక్కడి సీపీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం జరిగింది. అయితే, ఇంకా పరిస్థితి పూర్తిగా సద్దుమణగక ముందే మరో ఎనిమిది మంది మహిళలు శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా ఉత్త ప్రచారమేనని, ఎక్కువ సంఖ్యలో మహిళలు ఆలయానికి రావాలనే కుట్రతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని శబరిమల కర్మ సమితి అంటోంది.

Tags:    

Similar News