బ్రేకింగ్ : శివప్రసాద్ మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయనను కుటుంబసభ్యులు చికిత్స [more]

;

Update: 2019-09-21 08:56 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయనను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్సకోసం గురువారం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. తీవ్రంగా అస్వస్థతకు గురికావడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. శివప్రసాద్ ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు ముందు ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి తన నిరసనను వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News