ఫేక్ ట్వీట్లపై తెలంగాణ సర్కార్ సీరియస్

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తెలంగాణ సర్కార్ ఏపీ డేటాను దొంగలించిందని ఆరోపిస్తూ తయారుచేసిన #TSGovtstealsData హ్యాష్ ట్యాగ్ [more]

Update: 2019-03-05 06:10 GMT

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తెలంగాణ సర్కార్ ఏపీ డేటాను దొంగలించిందని ఆరోపిస్తూ తయారుచేసిన #TSGovtstealsData హ్యాష్ ట్యాగ్ పై అజ్ఞాత వ్యక్తులు రెండు రోజులుగా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాని వారు, తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని వారు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. ముంబై, పుణే బెంగళూరు, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ ట్వీట్లు ఎక్కువగా చేస్తున్నారు. డబ్బులిచ్చి ట్వీట్లు చేయిస్తున్నారని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోలీసులను విచారణకు ఆదేశించింది. ఫేక్ ట్వీట్ల వ్యవహారం వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆదేశాలిచ్చారు.

Tags:    

Similar News