టీజీ టోన్ మారిందే

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జగన్ ను ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నారన్నారు టీజీ [more]

;

Update: 2019-09-06 09:01 GMT
టీజీ వెంకటేష్
  • whatsapp icon

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జగన్ ను ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నారన్నారు టీజీ వెంకటేష్. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. దీంతో పాటు అమరావతిపై కూడా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అమారవతిని ఇప్పటికిప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రాంతాలను అభివృద్ధి చేసిన తర్వాతనే అమరావతి సంగతి చూడాలని జగన్ కు టీజీ వెంకటేష్ సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని టీజీ కోరారు.

Tags:    

Similar News