బ్రేకింగ్ : గవర్నర్ రెండో డెడ్ లైన్ కూడా..?

కర్ణాటక గవర్నర్ వాజూబాయి వాలా విధించిన రెండో డెడ్ లైన్ కూడా ముగిసింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని, తనకు ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నట్లు అనుమానం [more]

;

Update: 2019-07-19 12:43 GMT
గవర్నర్
  • whatsapp icon

కర్ణాటక గవర్నర్ వాజూబాయి వాలా విధించిన రెండో డెడ్ లైన్ కూడా ముగిసింది. సాయంత్రం ఆరుగంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని, తనకు ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నట్లు అనుమానం ఉందని గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కూడా విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగలేదు. గవర్నర్ ఆదేశాలను పాటించాలంటూ భారతీయ జనతాపార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం విశ్వాస పరీక్ష పై చర్చ ముగిసిన తర్వాతనే ఓటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. అది సోమవారం కావచ్చు. మంగళవారం కావచ్చో చెప్పలేనన్నారు. సభలో కుమారస్వామి సోదరుడు మంత్రి రేవణ్ణ నిమ్మకాయలు తెచ్చారని, చేతబడి చేయడానికే తెచ్చారంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు

Tags:    

Similar News