ముట్టడితో…. బదిలీ వేటు

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఏబీవీపీ విద్యార్థులు ప్రగతి భవన్ ను [more]

;

Update: 2019-10-23 07:58 GMT
ప్రగతి భవన్
  • whatsapp icon

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఏబీవీపీ విద్యార్థులు ప్రగతి భవన్ ను ముట్టడించారు. అక్కడ భారీ బందోబస్తు ఉన్నా భారీకేడ్లను తొలగించుకుని ఏబీవీపీ కార్యకర్తలు లోపలికి దూసుకెళ్లారు. భద్రతా లోపం వల్లే విద్యార్థులు దూసుకెళ్లారని అధికారులు భావించారు. దీంతో ప్రగతి భవన్ క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత కోసం ఉన్నఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు.

 

Tags:    

Similar News