ఎన్నికల్లో పోటీపై విజయమ్మ కీలక వ్యాఖ్యలు

రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని, అవసరమైతే ప్రచారం మాత్రం నిర్వహిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ పేర్కొన్నారు. శనివారం ఆమె ఓ ఛానల్ తో [more]

;

Update: 2019-01-12 08:09 GMT
విజయమ్మ
  • whatsapp icon

రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని, అవసరమైతే ప్రచారం మాత్రం నిర్వహిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ పేర్కొన్నారు. శనివారం ఆమె ఓ ఛానల్ తో మాట్లాడుతూ… జగన్ పై జరిగిన దాడిని అవహేళన చేయడం బాధ కలిగించిందన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాడని పేర్కొన్నారు. హామీల అమలులో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారన్నారు. జగన్ పాదయాత్ర వల్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించడమే తమ పార్టీ లక్ష్యమని, హోదా ఎవరు ఇస్తే వారికే తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మమ్మల్ని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని విమర్శించిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News