వైసీపీలో టిక్కెట్ల చిచ్చు…!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంటోంది. మదనపల్లి టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి కాకుండా మైనారిటీ అభ్యర్థికి ఇస్తున్నారనే ప్రచారంతో ఆయన అసంతృప్తికి [more]

;

Update: 2019-03-12 07:52 GMT
ramachandraiah comments on ncbn
  • whatsapp icon

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంటోంది. మదనపల్లి టిక్కెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి కాకుండా మైనారిటీ అభ్యర్థికి ఇస్తున్నారనే ప్రచారంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కార్యకర్తలతో సమావేశమైన ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, అనంతపురం జిల్లా ఉరవకొండ టిక్కెట్ లొల్లి ఏకంగా లోటస్ పాండ్ చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ శివరామిరెడ్డి వర్గం నేతలు లోటస్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు. బాపట్ల సీటును కూడా కోన రఘుపతికి కాకుండా గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన వర్గం ఆందోళనకు దిగింది. రెండు రోజుల్లో మొత్తం సీట్లకు జగన్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి పెద్దదైతోంది.

Tags:    

Similar News