Andhra Pradesh : విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
విశాఖ నగర ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే విశాఖలో మెట్రో పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
విశాఖ నగర ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే విశాఖలో మెట్రో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామని ఆయన శాసనమండలిలో వెల్లడించారు. వందశాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామన్న మంత్రి నారాయణ మొదటి ఫేజ్ లో 46.2 కి మీ లతో మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఈరోజు జరిగిన సభలో వెల్లడించారు. మొదటి ఫేజ్ లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారన్నారు.
ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలు...
ఈ కారిడార్స్ లో హనుమంతు వాక, మద్దెలపాలెం , విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయన్న పొంగూరు నారాయణఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్ ,దానిపైన మెట్రో నిర్మాణం చేయమని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాలని నిర్ణయించామని నారాయణ తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటయితే విశాఖ వాసుల సుదీర్ఘ కల నెరవేరుతుందని తెలిపారు. కాస్మోపాలిటిన్ నగరమయిన విశాఖలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెట్రో రైలు దోహదం పడుతుందని నారాయణ తెలిపారు.