Metro Rail : విశాఖ వాసులకు గుడ్ న్యూస్...మెట్రో రైలుకు పచ్చ జెండా

విశాఖపట్నం వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరయింది.;

Update: 2024-12-03 01:49 GMT

విశాఖపట్నం వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరయింది. మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దీంతో విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు కల సాకారమయితే విశాఖ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కు చెక్ పడుతుందని స్థానికులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. మొత్తం 76.9 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదటి దశలో ప్రభుత్వం ఒకే చెప్పింది.

మూడు దశల్లో...
తొలిదశలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ మొత్తం 34.4 కిలోమీటర్లు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకూ మొత్తం 5.08 కిలోమీటర్లు, తాడడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిలోమీటర్లు పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ మూడు లైన్లు పూర్తయిన త్వాత కొమ్మాది నుంచి భోగాపురం వరకూ 30,67 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుుల జారీ చేసింది. విజయవాడలోనూ వివిధ దశల్లో మెట్రో రైలు నిర్మాణ పనులను ప్రారంభించనున్ారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరూ, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి దశకు సంబంధించి 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయగా, మొత్తం 11,009 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.


Tags:    

Similar News