విశాఖవాసులకు గుడ్ న్యూస్.. తాజ్ హోటల్ వస్తుందోచ్

విశాఖ నగరానికి మరొక ప్రతిష్టాత్మకమైన ఫైవ్ స్టార్ హోటల్ రానుంది. తాజ్ హోటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి;

Update: 2024-11-08 04:55 GMT
taj hotel, construction, proposals, visakhapatnam latest news,  five star hotel is coming to visakhapatnam, construction of taj hotel in vishakapatnam, ap news today telugu

 taj hotel in vishakapatnam

  • whatsapp icon

విశాఖ నగరానికి మరొక ప్రతిష్టాత్మకమైన ఫైవ్ స్టార్ హోటల్ రానుంది. తాజ్ గ్రూప్ విశాఖ జిల్లాలో పెద్ద హోటల్ ను నిర్మించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే విశాఖ కాస్మోపాలిటిన్ సిటీ కావడంతో ఇప్పటి వరకూ ఫైవ్ స్టార్ హోటల్స్ అనేకం ఉన్నప్పటికీ తాజ్ గ్రూప్ కు చెందిన హోటల్ లేదు. దీంతో తాజ్ గ్రూప్ విశాఖ ప్రాంతంలో ఏర్పాటుచేయడానికి సిద్ధమయింది. ఇందుకోసం తాజ్ గ్రూప్ హోటల్ సిబ్బంది స్థల పరిశీలనను చేపట్టారు. విశాఖ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు.

వంద ఎకరాలు ఇస్తే...
అనకాపల్లిలోని అచ్యుతాపురం పరిసరప్రాంతాల్లో పర్యటించి, సముద్ర తీరానికి దగ్గరలో వంద ఎకరాలను కేటాయిస్తే తాము ఇక్కడ హోటల్ నిర్మిస్తామన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. విజయనగరంలోని భోగాపురం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ ఎయిర్ పోర్టు రానుండటంతో అనుకూలంగా ఉండనుందని భావించి ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించిన తాజ్ గ్రూప్‌నకు చెందిన ప్రతినిధులు స్థలాన్ని ఓకే చేస్తే ప్రభుత్వం కూడా భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజ్ గ్రూప్ సంస్థలు హోటల్ ను ఏర్పాటు చేస్తే విశాఖకు మరొక మణిహారం చేకూరినట్లే.


Tags:    

Similar News