రెయిన్ ఎఫెక్ట్... నిలిచిపోయిన రైళ్లు

మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Update: 2024-09-01 05:56 GMT

మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసం కావడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ లు కొన్ని చోట్ల దెబ్బతినడంతో పాటు ట్రాక్ పైకి నీళ్లు చేరడంతో రైళ్లు నిలిచి పోయినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఆ రైళ్లు ఇవే...
మొత్తం ఇరవై నాలుగు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ సహా పలు రైళ్లను మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్, పందిళ్లపల్లి సహా మరికొన్ని స్టేషన్లలో నిలిపివేశారు. అనేక రైళ్లు ఐదారు గంటలకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరుతున్నారు. రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News