Ap Elections : హిస్టరీ క్రియేట్ చేసిన చంద్రబాబు.. ఎప్పుడూ గెలవని నియోజకవర్గాల్లోనూ గెలుపు

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సాధించని విజయాలను ఈసారి చవి చూసింది

Update: 2024-06-04 11:45 GMT

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సాధించని విజయాలను ఈసారి చవి చూసింది. జనం ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ఒక్కటై సైకిల్ కు జై కొట్టారు. ఎస్సీ నియోజకవర్గాల్లో సహజంగా తొలి నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. అయితే ఇప్పుడు ఆ చరిత్రను టీడీపీ తిరగరాశారు. ఒకటంటూ ఏమీ లేదు. అసలు అభ్యర్థులను చూడలేదు. ఒకే ఒక లక్ష్యం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనం బటన్ నొక్కారని రిజల్ట్ ను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని చంద్రబాబు పార్టీ పగ్గాలుచేపట్టిన తర్వాత ఎప్పుడూ సాధించలేదు.

గతంలో ఏనాడూ...
చంద్రబాబు అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నారు కూటములను ఏర్పాటుచేశారు. అయితే అప్పుడు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం వస్తుందని బహుశ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాపకిందనీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతనే అర్థమయిందని చెప్పాలి. విశ్లేషకులకు సయితం అర్థం కాకుండా జనం నాడి ఉందని ఈ రిజల్ట్ తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలయితే తక్కువ మెజారిటీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతోతృటిలో అధికారాన్నికోల్పోవడాన్ని చూశాం. కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ దాదాపు వేల మెజారిటీలు. గతంలో ఎన్నడూ రానంత మెజారిటీలు వచ్చాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ...
వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టు ఉందని భావించారు. అర్బన్ ప్రాంతాల్లో తొలి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా రూరల్ ఏరియాలో అస్సలు కనిపించలేదు. దీంతో రూరల్ లో పట్టు తమకే ఉందన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అయితే ఈ ఫలితాలతో పటాపంచలయింది. రూరల్ లేదు.. పట్టణం లేదు... అంతా ఏకమైంది... ఒకే మాట.. అందరూ కలసి మాట్లాడుకున్నట్లు ఓటేసినట్లే అనిపిస్తుంది. ఇంత భారీ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండడు. చంద్రబాబు మీద నమ్మకం అయి ఉండవచ్చు. లేకుంటే జగన్ పాలన పై విసుగు పుట్టి ఉండవచ్చు. అందరూ కూడబలుక్కుని బటన్ నొక్కినట్లే ఓటింగ్ జరిగిందని ఈ రిజల్ట్ స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.


Tags:    

Similar News