Loksabha Elections : నేడు ఆరోదశ ఎన్నికలకు నోటిఫికేషన్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరో దశ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది;

Update: 2024-04-29 05:32 GMT
central election commission,  schedule,  jammu and kashmir
  • whatsapp icon

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆరో దశ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఏడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుంది. ఆరోదశ నోటిఫికేషన్ లో ఉన్న ఏడు రాష్ట్రాలకు సంబందించి పోలింగ్ మే 25వ తేదీన జరగనుంది.

రాష్ట్రాల్లో....
ఆరో విడతలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. ఈ ఏడు రాష్ట్రాల్లో ఆరో దశలో 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో కొన్ని ప్రధాన పార్టీల రాజకీయ నేతలు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News