మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పై క్లారిటీ ఇచ్చిన షిండే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే క్లారిటీ ఇచ్చారు

Update: 2024-11-27 11:47 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు నిర్ణయిస్తారని తెలిపారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామనితెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఏక్ నాధ్ షిండే స్పందించారు. మహాయుతిలో ఉన్న పార్టీలన్నీ కలసి కట్టుగానే పనిచేస్తాయని తెలిపారు. ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినా తమకు అభ్యంతరం లేదన్న ఏక్ నాథ్ షిండే.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక తర్వాత మంత్రి పదవులపై చర్చించనున్నామని చెప్పారు.

గత రెండేళ్ల నుంచి...
తాను గత రెండేళ్లలో ఇరవై నాలుగు గంటలు మహారాష్ట్ర కోసం పనిచేశానని చెప్పిన షిండే సామాన్యులు, రైతులు, మహిళల సమస్యలు తనకు తెలుసునని, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తీసుకువచ్చామని తెలిపారు. మోదీ, అమిత్ షాలు ముఖ్యమంత్రి పదవి పై తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. మీడియా సమావేశం పెట్టి మరీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈరోజు రాత్రికి గాని, రేపు గాని మహారాష్ట్ర సీఎం పదవిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News