కోనసీమ కొబ్బరితోటలో అరుదైన పక్షి..

పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం సముద్రతీరంలోని కొబ్బరి తోటలో సత్యనారాయణకు అరుదైన పక్షి తారస పడింది. ఆ పక్షిపై కాకులు..

Update: 2022-03-17 07:39 GMT

ఏలూరు : మనచుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల పక్షులు, జీవులు సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడూ అవి కనిపిస్తే.. అదో వింతగా ఉంటుంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతానికి ఏటా అరుదైన పక్షులు సంచరిస్తుంటాయి. అలా కోనసీమకు వచ్చిన ఓ పక్షి రైతు కంటపడింది. కొబ్బరితోటలో ఉన్న ఆ పక్షిపై కాకులు చుట్టుముట్టి దాడి చేస్తుండగా.. రైతు సత్యనారాయణ దానిని రక్షించారు.

పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం సముద్రతీరంలోని కొబ్బరి తోటలో సత్యనారాయణకు అరుదైన పక్షి తారస పడింది. ఆ పక్షిపై కాకులు దాడి చేస్తుండగా.. రైతు గమనించి కాకుల నుంచి దానిని రక్షించి సపర్యలు చేశారు. కాసేపటికి దానిని వదిలేయడంతో చెట్లపైకి ఎగిరిపోయింది. ఆ పక్షి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వింత పక్షి అటవీ ప్రాంతంలో ఉండే గుడ్ల గూబ జాతికి చెందిన పక్షి అని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తూ చిన్న జాతి పక్షులు, పాములు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయని పేర్కొన్నారు.


Tags:    

Similar News