Chandrababu : నేడు నందిగామకు చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నందిగామలో పర్యటించనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నందిగామలో పర్యటించనున్నారు. నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలంలో చంద్రబాబు బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సభలో పాల్గొననున్నారు. ముప్పాళ్లలో ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 10.15 గంటల నుంచి ఉండవల్లి నుంచి బయలుదేరి 11.30 గంటలకు చేరుకుంటారు.
ముప్పాళ్ల గ్రామంలో...
ముప్పాళ్ల గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకుని తర్వత నిమ్మతోటలో ప్రజా వేదికకార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు వస్తుండటంతో నందిగామ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం తిరిగి చంద్రబాబు ఉండవల్లి చేరుకుంటారు.