నేడు మూడు జిల్లాలకు జగన్

ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉంటారు.

Update: 2023-09-18 02:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నాు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. తిరుమల పట్టణంలో నిర్మించిన శ్రీనివాససేతు ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.

రాత్రికి తిరుమలలో...
అనంతరం ఎస్‌వి ఆర్డ్స్ కళాశాలలోని హాస్టల్ బిల్డింగ్‌ను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలకు చేరుకుని వకుళమాత, రచన రెస్ట్ హౌస్‌లను ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అక్కడే ఉండి పెద్ద శేషవాహనంలో ఊరేగే శ్రీవారిని వీక్షిస్తారు. రాత్రికి పద్మావతి అతిధిగృహంలోనే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.
రేపు నంద్యాలలో...
అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుని డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగు నీరందించే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా డోన్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News