నేడు నెల్లూరు జిల్లాకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2022-10-27 02:40 GMT
నేడు నెల్లూరు జిల్లాకు జగన్
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్ కో ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. జెన్ కోకు చెందిన మూడో యూనిట్ ను జగన్ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 800 మెగావాట్లు అని అధికారులు తెలిపారు. ఈరోజు ఈ ప్రాజెక్టుకును జగన్ జాతికి అంకితం చేయనున్నారు.

జెన్ కో ప్రాజెక్టును...
ఈరోజు ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.55 గంటలకు కృష్ణపట్నం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేలటూరుకు వెళ్లి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అక్కడ నెల్లూరు జిల్లా వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి బయలేదురి 3.30 గంటలకు జగన్ తాడేపల్లి చేరుకుంటారు.


Tags:    

Similar News