Andhra Pradesh : నేడు చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం
నేడు ఆంధ్రప్రదేశ్ కీలక ఒప్పందం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో - సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది;

నేడు ఆంధ్రప్రదేశ్ కీలక ఒప్పందం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో - సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయల నిదులను హౌసింగ్ అండ్ అర్బన్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
హడ్కో నిధులను...
రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఖరారు అయ్యాయి. అనేక సంస్థలు తక్కువకోట్ చేసి నిర్మాణ పనులు దక్కించుకున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియాడెవలెప్ మెంట్ బ్యాంకు రుణాన్ని మంజూరు చేసింది. ఒప్పందం పూర్తయిన తర్వత హడ్కో నిదులను పదకొండు వేల కోట్ల నిధులను విడుదలను చేయనుంది.