Andhra Pradesh : వచ్చే నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2024-06-25 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జులై మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సిద్ధమవుతుంది. గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిందే. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అవుతుంది. జులై మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు.

తేదీలు మాత్రం...
శాసనసభ సమావేశ తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. త్వరలో వాటిని వెల్లడిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2024 -2025 పూర్తిస్థాయి బడ్ెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. జులై 31వ తేదీతో ఓట్ ఆన్ బడ్జెట్ గడువు ముగియనుండటంతో దానికి ముందుగానే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తుంది.


Tags:    

Similar News