Andhra Pradesh : ఏపీ ప్రజలకు మున్సిపల్ శాఖ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. ఆస్తిపన్ను చెల్లించేవారికి ఊరట కల్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపికబురు చెప్పింది. ఆస్తిపన్ను చెల్లించేవారికి ఊరట కల్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే ఐదు శాతం పన్ను రాయితీ ఇస్తామని ఏపి మున్సిపల్ శాఖ తెలిపింది. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలటీలకు, కార్పొరేషన లకు ఇది వర్తిస్తుంది.
ఆస్తిపన్నులో రాయితీ...
మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లలో 2025 - 26 అసెస్మెంట్ సం.రానికి సంబంధించి పూర్తి పన్ను ఈ నెల 30 లోపు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పన్ను డిమాండ్ నోటీసులు ఆన్ లైన్ లో విడుదల అయ్యాక ఈఆర్పీ ద్వారా పన్ను చెల్లింపు ఆప్షన్ వస్తుందని అందుకు ఈ నెల 6వ తారీకు నుండి వేచిచూడాలి సంబంధిత వెబ్ సైట్ లో పేర్కొన్నారు.