Andhra Pradesh : గుడ్ న్యూస్.. వైద్యం కోసం ఇక ఏపీలోనే సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైద్య సేవలను మరింత మెరుగుపర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. చిన్న చిన్న రోగాలకు కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళుతున్నారు. అదే సమయంలో గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి రోగాలకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు.
ఏపీని హెల్త్ హబ్ గా...
దీనికి చెక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ను వైద్యానికి చిరునామాగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే ఆసుపత్రులకు వివిధ రాయితీలు అందించాలని నిర్ణయించారు. పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ తరహాలోనే ఆస్పత్రుల నిర్మాణానికీ రాయితీ ఇవ్వనున్నారు. ఆస్పత్రుల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారికి సబ్సిడీ విధి విధానాలు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.