ఏపీలో భారీగా ఐఏఎస్ బదిలీలు

ఆంధ్రప్రదేశ్ భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-04-07 02:05 GMT

ఆంధ్రప్రదేశ్ భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 56 మందిని బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. చిత్తూరు, నెల్లూరు అనంతపురం విజయనగరం ,బాపట్ల ,కర్నూలు కృష్ణ, సత్యసాయి జిల్లాలకు కొత్త కలెక్టర్ నియామించాారు..

కొత్త కలెక్టర్లు...
బాపట్ల కలెక్టర్‌గా రంజిత్ భాష, సత్య సాయి జిల్లా కలెక్టర్ గా పి అరుణ్ బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గా పి గౌతమి, విజయనగరం కలెక్టర్ గా నాగలక్ష్మి, కృష్ణా జిల్లా కలెక్టర్ గా రాజబాబు, కర్నూల్ జిల్లా కలెక్టర్ గా సృజన, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ఎస్ రామ సుందర్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గా జి గణేష్ కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎం హరి నారాయణ, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా షన్ మోహన్ నియమితులయ్యారు.


Tags:    

Similar News