ఏపీకి మరో గండం.. భారీ వర్షాలు తప్పవా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వానగండం పొంచి ఉంది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వానగండం పొంచి ఉంది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ నెల 29 తేదీ నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించవచ్చని తెలిపింది.
విద్యాసంస్థలకు సెలవు....
ఈ కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రజలు వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు రోజులపాటు చిత్తూరు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్పారు.