చంద్రబాబుపై దాడి కేసులో నిందితుల అరెస్ట్
చంద్రబాబు మీద రాళ్ల దాడి కేసులో నందిగామకు చెందిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు
ఒకప్పుడు ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద రాళ్ల దాడి కేసులో ఎన్‌టిఆర్ జిల్లా నందిగామకు చెందిన ముగ్గురు అనుమానితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నందిగామకు చెందిన కన్నెకంటి సజ్జనరావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌ను పోలీసులు విచారిస్తున్నారు. వీరి అరెస్టుతో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
రెండేళ్ల క్రితం...
2022 నవంబర్ ఐదో తేదీన చంద్రబాబు నందిగామలో ర్యాలీ నిర్వహించారు. రైతుబజార్ సమీపంలోకి ర్యాలీ రాగానే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వేయడంతో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదనరావు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో మధుసూదన్ రావు నందిగామ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై రాళ్ల దాడిలో అనుమానితులుగా ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.