ఇక డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయారా? ఇక అంతే.. కొత్త రకం శిక్ష

ఈ మధ్య కాలంలో చాలామంది తప్పతాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాధాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనాలు..

Update: 2023-08-30 05:33 GMT

ఈ మధ్య కాలంలో చాలామంది తప్పతాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాధాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ప్రతి రోజు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లలో ఎంతో మంది పట్టుబడుతున్నారు. కఠినమైన శిక్షణ విధిస్తున్నా మందుబాబుల్లో ఏ మాత్రం మార్పులు రావడం లేదు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి కోర్టులు కఠినమైన శిక్షణ విధిస్తున్నాయి. వారి తాగుడు అలవాటుకు అమాయక ప్రజలు బలి అవుతున్నారు. తాగి అతివేగంతో వెళ్తూ నియంత్రణ లేక అవతలివైపు వెళ్తున్నవారిని కూడా బలిగొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి కుటుంబాలలో నెలకొనే తీవ్ర విషాదాలను కూడా మనం అనేకం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇప్పించడం, అంతకుముందు జరిగిన భయంకరమైన ప్రమాదాల వీడియోలను చూపడం, వాటి ద్వారా వాళ్లలో మార్పు తెచ్చే ప్రయత్నాలు చేయడం లాంటి అనేకం చేసిన ఫలితం ఉండటం లేదు. మళ్లీ మల్లీ రిపీట్‌ అవుతూనే ఉన్నాయి.

అయితే సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎవరైనా దొరికితే.. పోలీసులు భారీగా జరిమానా వేస్తారు. అంతేకాకుండా తప్పతాగి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, వారం రోజుల పాటు జైలుకు పంపడం వంటి శిక్షలు పడుతుంటాయి. ఇలా చేయడం వల్ల కూడా మందుబాబులకు అలవాటు అయిపోయిందని పోలీసులు చెబుతున్న మాట. ఆ శిక్షలకూ ఫలితం ఉండకపోవడంతో కొత్తరకం శిక్షలు వేస్తున్నారు న్యాయమూర్తులు. వాళ్లు తప్పు చేస్తున్నట్టు బయట ప్రపంచానికి తెలిసేలా చేయడం ద్వారా వాళ్లలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో శిక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఏపీలోని వైజాగ్ బీచ్ రోడ్‌లో ఇటీవలకాలంలో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్‌కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరానికి ఆనుకుని ఉండే బీచ్ రోడ్‌లో ఈ తరహా డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా నగర శివారు ప్రాంతమైన భీమిలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇటీవల 60 మంది పోలీసులకు పట్టుబడ్డారు. అసలు విషయం ఏంటంటే వీరిలో ఎక్కువ మంది గతంలో కూడా పట్టుబడిన వాళ్లే. వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా భీమిలి కోర్టు ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా విధించింది కోర్టు. అంతటితో ఆగకుండా ఒకరోజు పాటు సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది న్యాయస్థానం.

అయితే ఇటీవలకాలంలో భీమిలి, బీచ్ రోడ్లలో నగర కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పట్టుబడ్డ వాహనాలను సీజ్‌ చేసి 60 మందిపై కేసు నమోదు చేశారు. వారిని మంగళవారం భీమిలి ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్లను చూసిన న్యాయమూర్తి 1000 రూపాయల జరిమానాతో పాటు భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాల ప్రాంగణంలో పిచ్చిమొక్కలు తీయించి పరిశుభ్రత పనులు చేయించాలని ఆదేశాలు జాఈ చేశారు న్యాయమూర్తి. ఇలా సామాజిక సేవ చేయించినట్లయితే వారిలో మార్పులు వస్తుందని ఇలాంటి శిక్ష వేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News