రఘురామ కోరుకున్న అవకాశం వచ్చేసింది.. కానీ అదే బాధ!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఉండి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణంరాజు కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారు చేస్తున్నట్లు నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధవారం లేదా గురువారం అధికారికంగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యే ఉండటంతో ఏకగ్రీవంగానే రఘురామ ఎన్నిక కానున్నారు.
2019లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి రఘు రామకృష్ణరాజు ఎంపీగా ఎన్నికయ్యారు.ఆయన ఎన్నికైన కొన్ని రోజులకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను స్పీకర్ గా ఉండాలని అనుకుంటున్నానని గతంలో రఘురామ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రఘురామకు అవకాశం దక్కింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం రఘురామకు కాస్త నిరాశ కలిగించొచ్చు.