Andhra Pradesh : మహిళలకు గుడ్ న్యూస్ వారి ఖాతాల్లో పదిహేను వందలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే ఆడబిడ్డ పథకం అమలులోకి రానుందని అర్థమవుతుంది. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న మహిళలకు నెలకు పది హేను వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారంత ఈ పథకం కింద అర్హులేనని ప్రభుత్వం ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఆడబిడ్డ పథకం కింద...
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకటించారు. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఆర్థికంగా వెనకబడిన వారు కూడా ఈ పథకం కింద పదిహేను వందలు అందుకోవడానికి అర్హులే. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఈ పథకానికి సంబంధించి 3,341.82 కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో త్వరలోనే ఈ పథకం గ్రౌండ్ అవుతుందని భావిస్తున్నారు.