సునీల్ ఒక సైకో.. జగన్ ఆనందం కోసమే?
ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు రావాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే దీనిపై రఘురామ కృష్ణరాజు స్పందించారు. తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని తెలిపారు. విచారణకు హాజరై వారి ప్రశ్నలకు సమాధానమిస్తానని చెప్పారు. ఏపీ సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని రఘురామ కృష్ణరాజు విమర్శించారు. జగన్ ఆనందం కోసమే తనకు నోటీసులు ఇచ్చారన్నారు.
భీమవరం వెళ్లాలనుకుంటే?
గతంలో తనను అరెస్ట్ చేసినప్పుడు సీఐడీ పోలీసులు సీసీ టీవీ కెమెరాలు లేకుండా చేశారన్నారు. తనపైన, తన వ్యక్తిగత సిబ్బందిపైన కూడా దాడికి దిగారన్నారు. ఈ విషయాలన్నింటినీ తాను సుప్రీంకోర్టుకు తెలిపానని చెప్పారు. అయితే సంక్రాంతి పండగకకు రఘురామ కృష్ణరాజు భీమవరం వెళ్లి మూడు రోజులు గడపాలనుకున్నారు. కానీ ఆ పర్యటనను రద్దు చేసుకోవడం కోసమే సీఐడీ నోటీసులు జారీ చేసిందని అంటున్నారు. జగన్ కు, సీఐడీ అధికారి సునీల్ కు సంక్రాంతి విశిష్టత తెలియదని రఘురామ కృష్ణరాజు అన్నారు.