రామకృష్ణ హత్య కేసు: టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందింపు

టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో ప్రభుత్వ సీరియస్‌.. నిర్లక్ష్యం వహించిన పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.;

Update: 2025-03-15 15:12 GMT
రామకృష్ణ హత్య కేసు: టీడీపీ కార్యకర్త హత్యపై ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందింపు
  • whatsapp icon

చిత్తూరు: టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, పుంగనూరు సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్‌ సాంబను నిర్లక్ష్య ధోరణికి బాధ్యులుగా నిర్ధారిస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం వహించడం ద్వారా హత్యకు కారణమయ్యారంటూ వారిపై కఠిన చర్యలు తీసుకుంది.

దారుణ ఘటన: పాత కక్షలే హత్యకు కారణం

ఈ రోజు (శనివారం) చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో రామకృష్ణను వైసీపీ కార్యకర్త వెంకటరమణ నరికి చంపాడు. పాత కక్షల నేపథ్యంలో వెంకటరమణ వేట కొడవలి చేతపట్టి రామకృష్ణను వెంటాడి హత్య చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని మదనపల్లె ఆస్పత్రికి తరలించినా, మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

వీడియోలో ముందే తన ప్రాణహాని గురించి రామకృష్ణ వెల్లడి

రామకృష్ణ హత్యకు కొన్ని రోజుల ముందే ఒక వీడియో రిలీజ్ చేశాడు. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా స్పందన లేకుండా పోయిందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను పోలీసులు వన్‌సైడ్‌గా చూస్తున్నారని, న్యాయం చేయడం లేదని ఆరోపించాడు. చివరకు, తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ వీడియో రిలీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

Tags:    

Similar News