ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ (APSRTC) అన్ని రకాల బస్సుల్లో 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీని పొడిగించింది. టికెట్ల కొనుగోలు సమయంలో సీనియర్ సిటిజన్ల భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డులను చూపించాల్సి ఉంటుంది.
ఇక ఏపీలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఉచిత బస్సు హామీపై అధ్యయనం పూర్తయిందని ఏపీ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మహిళలకు ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించే అవకాశం ఉందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.