Andhra Pradesh : నేడు ఏఆర్ డెయిరీ ఎండీ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది.;

andhra pradesh high court
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంలో ితిరుపతి పోలీసులు ఏఆర్ డెయిరీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం కూడా దీనిపై విచారణను ప్రారంభించింది.
కేసు నమోదు చేయడంతో...
అయితే ఈ నేపథ్యంలో ఏఆర్ డెయిరీ రాజశేఖరన్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటీషన్ వేశారు. తనకు ఇంటీరిం ప్రొటెక్షన్ కూడా ఆయన అడిగారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఈ కేసు విచారణ ప్రారంభం కావడంతో ముందస్తు అరెస్ట్ చేయకుండా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.