Tirumala : నేడు శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... రద్దీ సాధారణమే

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు

Update: 2024-10-19 03:03 GMT

tirumala tirupati devasthanam arijitha seva tickets

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నేడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకూ దీనికి సంబంధించి లక్కీడిప్ రిజర్వేషన్ కు అవకాశముంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నానికి లక్కీడిప్ విధానంలో జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నారు. దీంతో ఆర్జిత సేవలకు వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో ఈ టిక్కెట్లు ఉంచగానే అమ్ముడు పోతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఆర్జిత సేవలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురు చూస్తుంటారు.

హుండీ ఆదాయం....
ఈరోజు తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు. శనివారం అయినా సరే రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయ పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్వనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,412 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News