Chandrababu : అమరావతిని నిర్మించి తీరుతాం

అమరావతిని నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు;

Update: 2024-10-19 07:29 GMT

అమరావతిని నిర్మించి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ అభిప్రాయమని అన్నారు. సీఆర్డీఏ కార్యాలయం భవనం శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ ను నిర్మించిన ఘనత టీడీపీదేనని అన్నారు. తాను ఈ విజన్ తో ఈ అమరావతిని ప్రారంభించానని చెప్పారు. మన సంకల్పం గొప్పదని, అది బలంగా ఉంటే దానిని సాధించడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. అమరావతి కోసం యాభై నాలుగు వేల ఎకరాలను సేకరించామని తెలిపారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం అమరావతిని...
గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని ప్రయత్నించిందన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పైసా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. ఒక చరిత్ర రాయడానికి మనం సిద్ధమయ్యాని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఏర్పరచినా రైతులు వీరోచితంగా పోరాడారన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. వారికి ఇస్తామని చెప్పిన కౌలును కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు. సీఆర్డీఏ భవనాన్ని నాలుగు నెలల అనంతరం మనమే ప్రారంభించుకుందామని తెలిపారు.


Tags:    

Similar News