Liquor Shops : జాక్ పాట్ అంటే నీదే జానీ.. ఒకే జిల్లాలో ఐదు లిక్కర్ షాపులు

బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు జిల్లాలో ఐదు మద్యం షాపులు లాటరీలో దక్కాయి

Update: 2024-10-14 11:49 GMT

మద్యం దుకాణాలకు లాటరీ విధానం ద్వారా ఎంపిక పూర్తయింది. అయితే లాటరీ విధానంలో స్వయంగా జిల్లా కలెక్టర్లు మాత్రమే పాల్గొన్నారు. లాటరీ విధానంలో ఎవరికి మద్యం దుకాణాలు వస్తే వారే అదృష్టవంతులు. మిగిలిన వారు అత్యంత దురదృష్టవంతులే. పైగా తాము దరఖాస్తుగా చెల్లించిన రెండు లక్షల రూపాయలు కూడా తిరిగి రావు. రెండు లక్షల నష్టంతో ఉస్సూరమంటూ వెనుదిరగాల్సి వస్తుంది. అందుకే వచ్చినోళ్లు పండగ చేసుకుంటుంటే... లాటరీలో తమ పేర్లు రాని వాళ్లు మాత్రం నిరాశ నిస్పృహలతో వెనుదిరిగారు.

ఒకరికే ఐదు మద్యం దుకాణాలు...
సహజంగా ఒక మద్యం దుకాణాలు ఒకటి వస్తే అది ఓకే. దానినే అదృష్టమంటారు. కానీ ఏకంగా జిల్లాలో ఐదు దుకాణాలకు తన పేరు వస్తే మాత్రం దానిని లక్కు అనరు. దానికన్నా పెద్ద పదం అన్నది వాడాల్సి ఉంటుంది. జాక్ పాట్ కొట్టినట్లేనని చాలా మంది అనుకుంటారు. అటువంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఒకే వ్యక్తికి ఐదు మద్యం దుకాణాలు రావడంతో ఆయన అదృష్టాన్ని చూసి మిగిలిన వారు కుళ్లుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు...
ఆయన ఎవరో కాదు. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు. ఆయనకు ఏకంగా ఐదు దుకాణాలను లక్కీ లాటరీలో దక్కించుకున్నారు. ఈరోజు పుట్టపర్తి కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో మద్యం షాపులను తీశారు. అయితే వరసగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం ఒకటో నెంబరు, నాలుగో నెంబరు, ధర్మవరం రూరల్ ప్రాంతంలో పన్నెండో నెంబరు, ముదిగుబ్బ మ ండలంలో 19 నెంబరు దుకాణం, బత్తలపల్లి మండలంలోని 14వ నెంబర్ దుకాణాలకు ఈయన పేరే లాటరీలో వచ్చింది. అంటే ఈయన ఒక్కడికే ఐదు మద్యం షాపులు ఒకే ఏరియాలో లభించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News