Ys Sharmila : ఆయన కనిపిస్తాడు... ఈయన కనిపించడు.. మిగదంతా సేమ్ టు సేమ్

ఆంధ్రప్రదేశ్ లో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2024-01-24 07:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ, టీడీపీ బీజేపీతో కుమ్మక్కయి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కనిపించే పొత్తులు పెట్టుకుంటుంటే.. వైసీపీ కనిపించని పొత్తులు పెట్టుకుంటుందని అన్నారు. ప్రత్యేక హోదా పై జగన్ మాట తప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసింది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ను రెండు పార్టీలు మోసం చేశాయని షర్మిల ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ కి అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు.

తక్కువకే అమ్మేసి...
గంగవరం పోర్టు ను అదాని కి అమ్మేశారని, 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉందన్న నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం తగ్గువకే అమ్మేశారని షర్మిల ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ఒక కుట్ర అని ఆమె అన్నారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ హయాంలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నీ 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారని, ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారన్నారు.బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని, బీజేపీ తో ఇక్కడ పార్టీలు దోస్తీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తామని ఆమె అన్నారు.


Tags:    

Similar News