Amarvathi : ఇక చకా చకా రాజధాని అమరావతి పనులు.. మూడేళ్లలో పూర్తిచేయాలన్న సంకల్పం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి;

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన జరిగిన తర్వాత ఇక చకా చకా నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్నయించింది. ఇప్పటికే వివిధ పనుల కోసం టెండర్లను ఆహ్వనించిన ప్రభుత్వం వాటిలో లోయెస్ట్ గా కోట్ చేసిన కంపెనీలను ఎంపిక చేసి సెలెక్ట్ చేసింది. అయితే శంకుస్థాపన జరగకుండా పనులు ప్రారంభించకూడదన్నఏకైక ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. త్వరలోనే ప్రధాని మోదీ శంకుస్థాపనకు తేదీ ఖరారవుతుందని, ఈ నెల 19వ తేదీన ప్రధాని అమరావతి వచ్చే అవకాశమున్నందునమూడో వారంనుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రపంచ బ్యాంకు నిధులు...
రాజధాని నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంకు 6,700 కోట్లరూపాయలు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడత రుణంగా 3,535 కోట్ల రూపాయలను విడదుల చేసింది. ఈ నిధులతో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలోనే ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా 6,700 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రెండు బ్యాంకుల నుండి రూ.13,600 కోట్లు రుణం రూపంలో అందుతుంది. అదనంగా మరో1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయంగా అందిస్తోంది.
ఇరవై వేల కోట్ల రూపాయలతో...
వీటితో పాటు హడ్కో నుండి పదకొండువేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి అందింది. అంతేకాకుండా, జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి ఇంకొక ఐదు కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాదాపు ఇరవైకోట్ల రూపాయల వ్యయంతో అమరావతి తొలి దశపనులను పూర్తిచేయాలన్ననిర్ణయంతో ప్రభుత్వం ఉంది. ఈనిర్మాణాలు తొలి దశ పూర్తయితే ఇక రాజధానికి ఒక రూపురేఖలు రావడమే కాకుండా ఆ ప్రాంతంలో భూముల విలువ కూడా రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయన్నఅంచనాల్లో ప్రభుత్వం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భూముల విక్రయాలకు అప్పుడు సులువుగా మారుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. 2028 నాటికి దీనిపై ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.