Tirumala : నేడు తిరుమలలో స్వామి వారిని నేరుగా దర్శనం. వేచి ఉండకుండానే?

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం కావడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది

Update: 2024-09-23 02:52 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. సోమవారం కావడంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. క్యూ లైన్లు కూడా బయట వరకూ వేచి ఉండి 24 గంటల పాటు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వసతి గృహాల విషయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి కనిపించింది. కాగా నేడు స్వామి వారిని నేరుగా క్యూ లైన్ లో వేచి ఉండకుండానే దర్శించుకునేందుకు వీలుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు వరస సెలవులు కూడా రావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉందని, తిరిగి దసరా సెలవులు ప్రారంభమయ్యే సమయానికి రద్దీ పెరుగుతుందని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని కంపార్ట్‌మెంట్లలో...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండకుండానే స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వీలుంది. భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటలు మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,436 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,437 మంది భక్తులు తలనీలాలను సమర్పించకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.57 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
నేడు ఆన్ లైన్‌లో...
నేడు డిసెంబరు నెల శ్రీ‌వారి దర్శన టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా ను టీటీ విడుదల చేయనుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను ఈరోజు ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వ‌యోవృద్ధులు, దివ్యాంగులు,  దీర్ఘ కాలిక వ్యాధులున్న వారు తిరుమలశ్రీ‌వారినిద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. ఆన్ లైన్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను మాత్రమే వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News