Pawan Kalyan : పవన్ గోల్ అదే.. రీచ్ కావడానికి మాత్రం కొంత సమయం?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాటలు మెరుగుపర్చుకుంటున్నారు.;

Update: 2025-04-05 06:33 GMT
pawan kalyan, deputy chief minister, chief minister, ap politics
  • whatsapp icon

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాటలు మెరుగుపర్చుకుంటున్నారు. అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళుతూ తన లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకున్నట్లే కనపడుతుంది. తనకు ఇంతటి విజయాన్ని అందించిన కాపు సామాజికవర్గంతో పాటు అభిమానుల ఆశలు నీరుగార్చకుండా కొంత ఆలస్యమయినా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ఒక మార్గాన్ని రూపొందించుకుంటున్నారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇటు కాపు సామాజికవర్గం, అటు కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీ ఓటర్లతో పాటు అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు పవన్ కల్యాణ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది.

కేంద్ర సహకారంతో...
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు సపోర్టు పవన్ కల్యాణ్ కు ఉంది. మోదీ నుంచి కింది స్థాయి నేతల వరకూ పవన్ కల్యాణ్ ను అభిమానిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తక్కవ సార్లు ఢిల్లీకి వెళుతూ వారితో సత్సంబంధాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఫ్యూచర్ లో తనకు అండగా నిలబడేందుకు అన్ని రకాలుగా ఒక్కొక్క మెట్టును పేర్చుకుపోతున్నారు. బీజేపీ కూడా పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని గట్టిగా అనుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదు. ఇప్పుడు కాకుండా అవసరమైన సమయంలో పవన్ ను సీఎం పదవి ఎక్కించాలన్న ఉద్దేశ్యంతో కమలనాధులున్నారు.
సనాతన ధర్మం పేరిట...
పవన్ కల్యాణ్ కూడా నిదానంగా మెట్లను పేర్చుకుపోతున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు అందరి మనిషిలా కనిపిస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో పాటు మిగిలిన సామాజికవర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యూచర్ సీఎంగా అడుగులు వేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు హిందుత్వాన్ని భుజానకెత్తుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్ అటు బీజేపీ మనసును దోచుకోవడమే కాకుండా ఇటు హిందుత్వ నినాదాన్ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నా ఆయన గోల్ మాత్రం ముఖ్యమంత్రి పదవి అనేలా వ్యవహార శైలి కనిపిస్తుంది. తాజాగా భద్రాచలం రామయ్య కల్యాణానికి హాజరు కావడం కూడా అందులో భాగమేనంటున్నారు.
కమ్మ సామాజికవర్గం కూడా...
కమ్మ సామాజికవర్గం కూడా చంద్రబాబు, లోకేశ్ తర్వాత పవన్ కల్యాణ్ ను మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. జగన్ ను ఎట్టిపరిస్థితుల్లో వారు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఆర్థికంగా, సామాజికపరంగా, ఎన్ఆర్ఐల నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దల వరకూ చంద్రబాబు, లోకేశ్ తర్వాత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకుంటారు. ఇక ఇటు కాపు సామాజికవర్గం, అటు అభిమానుల బలమైన కోరిక పవన్ సీఎం కావడమే. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గిరిజనులు, దళితులు, బలహీనవర్గాల ప్రతినిధిగా పవన్ కల్యాణ్ తనను తాను మలచుకుంటూ పోతున్నారు. అయితే సుదీర్ఘ కాలం పాటు వేచి చూసైనా పవన్ కల్యాణ్ తన గోల్ ను చేరే అవకాశాలు మాత్రం లేకపోలేదు.














Tags:    

Similar News