శ్రీశైలం ఆలయం వద్ద కలకలం రేపిన డ్రోన్.. ఎవరి పని ?

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయ భద్రతా సిబ్బంది వైఫల్యం డ్రోన్ రూపంలో మరోసారి బయటపడింది.

Update: 2021-12-24 09:30 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయ భద్రతా సిబ్బంది వైఫల్యం డ్రోన్ రూపంలో మరోసారి బయటపడింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణి వద్ద భక్తులు డ్రోన్ ను గుర్తించి, ఆలయ అధికారులు, సెక్యూరిటీకి సమాచారం అందించారు. వెంటనే ఆ డ్రోన్ ను చూసిన ఆలయ భద్రతా సిబ్బంది దాని వెంట పరుగులు తీశారు. టెక్నాలజీతో డ్రోన్ ను కిందికి దించి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ? ఆలయం వరకూ డ్రోన్ ఎలా తీసుకొచ్చారు ? ఎవరు సహకరించారు ? డ్రోన్ ను ఎందుకు ఎగురవేశారు ? ఇలా పలు రకాలుగా ప్రశ్నించారు. అనంతరం ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. కాగా.. డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులు గుజరాత్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్లిద్దరూ ఏ ఉద్దేశ్యంతో ఆలయం వద్ద డ్రోన్ ను ఎగురవేశారో తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో శ్రీశైలం ఆలయం వద్ద రాత్రి సమయంలో డ్రోన్ లు కలకలం రేపాయి. అప్పట్నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రం ఆలయ ప్రాంగణంలో డ్రోన్లపై నిషేధం కొనసాగుతోంది.



Tags:    

Similar News