Perni Nani : ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ ను వీడేది లేదు
మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.;

mlc election in AP
మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెడుతూ తమను వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తనతో పాటు తన కుమారుడు, భార్యపై కూడా అక్రమ కేసులు బనాయించారన్న పేర్ని నాని తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని పేర్ని నాని ప్రకటించారు. తమ కుటుంబ సభ్యులపై ఎన్ని కేసులుపెట్టినా భయపడేది లేదని తెలిపారు.
ఎన్ని కేసులు పెట్టినా..
ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా తాము జగన్ వెంట ఉంటామన్న పేర్ని నాని తమను బెదిరించి లొంగ దీసుకోలేరని స్పష్టం చేశారు. తాము న్యాయస్థానంలో పోరాడతామని, అలా కాకుంటే జైలుకు వెళతామని కూడా అందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.