Perni Nani : పేర్ని నాని సతీమణి ముందస్తు బెయిల్ పై నేడు విచారణ

మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధ ముందస్తు బెయల్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది;

Update: 2024-12-30 04:20 GMT
jayasudha, perni nanis wife, relief, machilipatnam
  • whatsapp icon

మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధ ముందస్తు బెయల్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ2 నిందితురాలగా పేర్ని జయసుధ ఉన్నారు. ఆమె తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు దీనిపైన్యాయస్థానంలో విచారణ జరగనుంది.


మానసతేజ అరెస్ట్ తో...

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఏ2 గా నిందితుడిగా ఉన్న గోదాము మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నంలోని పేర్ని నాని కి సంబంధించి గోదాములో 7,200 టన్నుల బియ్యం మాయమైన కేసులో మానస తేజను విచారించిన తర్వాత మరిన్ని చర్యలకు దిగే అవకాశాలున్నట్లు తెలిసింది.




Tags:    

Similar News