ఆర్-5 జోన్‌పై హైకోర్టులో విచారణ
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు
రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. రాజధాని కోసం సమీకరించిన భూములను ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు జీవో నెంబరు 45ను ప్రభుత్వం విడుదల చేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని రైతులు
దీంతో దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తాము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే, వాటిని స్థానికేతరులకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది. దీనిపై తీర్పు ఎలా వస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నం రైతులు వేసిన పిటీషన్ ను విచారించనుంది. రేపటి నుంచి హైకోర్టుకు ఐదురోజులు సెలవులు ఉండటంతో తీర్పు ఏరకంగా వస్తుందన్నది చర్చనీయాంశమైంది.