సుప్రీంకోర్టుకు అమరావతి రైతులు
అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రైతుల పిటిషన్ వేశారు
అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో రైతుల పిటిషన్ వేశారు. సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించిన రైతుల తరుపున న్యాయవాది శేషాద్రినాయుడు ప్రస్తావించారు. ఈనెల 14న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఆర్-5 జోన్ వ్యవహారంపై...
ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని రైతుల తరపు న్యాయవాది కోరారు. అయితే ఈనెల10న కేసుల జాబితా ఇప్పటికే తయారైందని, ఆరోజు వీలు కాదని, 14న ఈ పిటీషన్‌ను విచారణకు తీసుకుంటామన్న సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.