భోగిమంటల్లో జీవోలు.. అమరావతి రైతుల విన్నూత్న నిరసన

అమరావతి రైతు సెగల పేరుతో మందడంతో భోగిమంటలను రైతులు నిర్వహించారు.

Update: 2022-01-14 02:01 GMT

అమరావతి రైతు సెగల పేరుతో మందడంతో భోగిమంటలను రైతులు నిర్వహించారు. గత ఏడాదిన్నర కాలంగా అమరావతిని రాజధాని చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. మూడు బిల్లులు వెనక్కు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వం మళ్లీ కుట్రలకు దిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. 29 గ్రామాలుగా ఉన్న అమరావతి ప్రాంతాన్ని 19 గ్రామాలకు కార్పొరేషన్ ను చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తప్పుపట్టారు.

కొత్త కార్పొరేషన్ ను...
కొత్తగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోలను రైతులు భోగి మంటల్లో వేసి కాల్చారు. తాము రాజధాని అమరావతిలో కొనసాగేంత వరకూ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు చెప్పారు. ప్రభుత్వం మాట తప్పకుండా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.


Tags:    

Similar News